Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 July 2022, 12:07 pm Posted by : Anjaneyulu Dega

గూగుల్‌, ఫేస్‌బుక్‌ వార్తలకు ‘బిల్లు’?

దిల్లీ: తమ వేదికలపై అందజేసే కొన్ని వార్తలకు గాను ఆల్ఫాబెట్‌ (గూగుల్‌, యూ ట్యూబ్‌), మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌), ట్విటర్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ కంపెనీలు కొంత మొత్తాన్ని చెల్లించేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లు ఇప్పటికే ఇలాంటి చట్టాలు చేయగా.. భారత్‌లో ఈమేరకు ప్రతిపాదిత బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే.. భారత వార్తాపత్రికలు, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లకు ప్రయోజనకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అటు వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.