
ములుగు జిల్లా: ఎమ్మెల్యే సీతక్కకు పెనుప్రమాదం తప్పింది. శనివారం ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వాగులో పడవ పై వస్తుండగా మధ్యలో పెట్రోల్ అయిపోయి చెట్టుకు ఢీ కొని పడవ ఆగిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, తిరిగి పడవలో ఏటూరునాగారం వస్తున్న క్రమంలో వాగుదాటుతుండగా మార్గమధ్యంలో బోట్ లో పెట్రోల్ అయిపోగా వాగు ఉద్ధృతికి ఒక ప్రక్కకి పడవ కొట్టుకొనివచ్చి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోగా అందులో నుండి దిగి ప్రాణాలు కాపాడుకుని సీతక్క ఒడ్డుకు వచ్చారు.
అందులో ఉన్న ఎవరికి కూడా ఏమీ కాకపోవడం తో అందరు ఊపిరి పీల్చుకున్నారు.