పారిశుద్ధ్య చర్యలు త్వరగా పూర్తి చేయాలి..!
మాతా, శిశు కేంద్రంను సందర్శించిన జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన జిల్లా కేంద్రంలోని మాతా, శిశు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా, చెదారంను త్వరితగతిన తొలగింపు చర్యలు చేపట్టి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాతా, శిశు కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద కారణంగా దెబ్బతిన్న ఆనుషత్రి పరికరాలకు అవసరమైన మరమ్మత్తులు చేయించాలని, ఆయా వార్డులు, ఆసుపత్రి పరిసరాలలో...