షాకింగ్: 45 తుపాకీలు స్వాధీనం.. దంపతుల అరెస్టు?
దిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 తుపాకీలను అక్రమంగా తరలిస్తున్న భారతీయ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇవి నిజమైన తుపాకులా, కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఈ కేసులో రంగంలోకి దిగిన ఉగ్రవాద నిరోధక విభాగం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ ) ఇవి పూర్తిగా నిజమైన తుపాకులుగానే కనబడుతున్నాయని పేర్కొంది. జులై 10న వియత్నాం నుంచి భారత్ కు తిరిగి వచ్చిన ఈ...