Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 July 2022, 4:08 pm Posted by : Anjaneyulu Dega

వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి.!

మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్

మంచిర్యాల జిల్లా: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ సూచించారు. రోడ్డు కోతలకు గురై, దారి మధ్యలో అనుకోని గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలను నెమ్మదిగా నడపాలన్నారు. అత్యవరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దని కోరారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. భారీ వాహనాలను రోడ్డుకు ప్రక్కన నిర్ణిత ప్రదేశంలో నిలిపి, పార్కింగ్ లైట్స్ వేయాలని సూచించారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు మీకోసం 24 గంటలు అందుబాటులో ఉంటారని, వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..