స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అందుకోవడం అభినందనీయం.?
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు 21 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందని...