Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 July 2022, 10:12 pm Posted by : Anjaneyulu Dega

స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అందుకోవడం అభినందనీయం.?

 

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి

మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు 21 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగం, సత్ప్రవర్తన, సామర్ధ్యాల పెంపు వంటి అంశాలపై విచారించి ఉత్తమ ప్రతిభ గల పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 21 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఇలాంటి మరిన్ని అవార్డులకు ఎంపికయ్యేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సెక్టోరల్ అధికారి చౌదరి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..