Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 July 2022, 10:18 pm Posted by : anjudega

దళిత బంధు లబ్దిదారులకు ఆస్తులు పంపిణీ.!

మంచిర్యాల జిల్లా, చేన్నూర్: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బల్క సుమన్ అన్నారు. గురువారం చెన్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు ఆయన ఆస్తులు పంపిణీ చేశారు. దళిత బంధు పథకం దళితుల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.