
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. రవీందర్ రెడ్డి
మంచిర్యాల జిల్లా: జిల్లాలో 10వ తరగతిలో 7.0 గ్రేడ్ ఆపైన సాధించిన ఎస్.సి., ఎస్.టి., బి.సి., ఈ-బి.సి., దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి అధికారి పి.రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, ఎంసెట్ కొరకు ప్రవేశాలు పొందుటకు ఈ-పాస్ వెబ్సైట్ (epass.cgg@telangana.gov.in) ద్వారా ఈ నెల 8 నుండి 20వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీన ఎంపికైన వారి జాబితా కార్యాలయం నందు ప్రకటించడం జరుగుతుందని, 27వ తేదీన జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం నందు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థుల విద్యార్హత నిజ ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అర్హత గల విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.