Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 July 2022, 7:35 pm Posted by : Anjaneyulu Dega

12 మంది కానిస్టేబుళ్ల కు సన్మానం.?

రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్దాపూర్ లో 17వ పోలీస్ బెటాలియన్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఏ. ఆర్(ఆర్మ్ రిజర్వుడ్)కు కన్వర్షన్ వెళ్తున్న 12 మంది కానిస్టేబుల్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రమణ్యం వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. కమాండెంట్ మాట్లాడుతూ 17వ పోలీస్ బెటాలియన్ లో వారు చేసిన సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు. ఇదేవిధంగా వారు ఏ. ఆర్ (ఆర్మ్ రిజర్వుడ్) కు వెళ్లిన తర్వాత ఇదే విధంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి. యస్. పి కృపాకర్, అసిస్టెంట్ కమాండంట్ పార్థసారథి రెడ్డి, ఆర్ఐలు డి. శంకర్, పి. నారాయణ, పి. రాజేందర్, బి. శ్రీధర్, ఎ.రమేష్, రమేష్, సి. హెచ్ మాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.