ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్సైట్ www.tslprb.inలో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 554 ఎస్సై, 15,644...