Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 July 2022, 12:25 pm Posted by : Anjaneyulu Dega

జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలి

మంచిర్యాల జిల్లా: మంచిర్యాలకు జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని కోరుతూ శనివారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవిని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ఉపాధ్యక్షులు రజనీష్ జైన్ కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని వారు కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే నవోదయ విద్యాలయం మంజూరు చేస్తామని తెలిపారు..