పుతిన్ కు మోదీ ఫోన్.. ఏం చర్చించారంటే?
దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకించి వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించే అంశంపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ వ్యవహారాలతో...