Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 July 2022, 7:41 am Posted by : Anjaneyulu Dega

పదిలో మెరిసిన మా ఆణిముత్యం

ఆదర్శ విద్యాలయం హైస్కూల్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ విద్యాలయంలో ఈ సంవత్సరం పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పాయింట్లు సాదించినందుకు పాఠశాల ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. 9.5/10 పాయింట్లు సాధించిన కె మధు ను ఈ సందర్బంగా వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు మరియు విద్యార్థులు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.