Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 July 2022, 9:50 pm Posted by : Anjaneyulu Dega

కాసిపేట గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడం.. మహమ్మారి మళ్లీ సోకుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 350 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. ఒకే రోజు 10 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతుతున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 10 మందికి నిర్ధారణ అయింది.

కరోనా బారిన పడిన విద్యార్థులను హోం క్వారంటైన్ కు తరలించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అని వైద్య సిబ్బంది సూచించారు.