Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 June 2022, 7:17 pm Posted by : Anjaneyulu Dega

ప్రైవేట్ హాస్పిటల్స్ ఉద్యోగులకు ఇన్స్యూరెన్స్ కల్పించాలి.

మంచిర్యాల జిల్లా: జిల్లా లోని ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్స్యూరెన్స్ కల్పించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈశ్వరయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ రావు, కోశాధికారి మంతెన రమేష్ మాట్లాడుతూ దూరప్రాంతాల నుండి విధులకు వచ్చి, వెళ్లే క్రమంలో ఉద్యోగులు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని తెలిపారు. దీంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి రూ. 10 లక్షలు ప్రమాద భీమా చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు..