Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 June 2022, 6:40 pm Posted by : Anjaneyulu Dega

నిరుపేదలకు అండగా పోలీసులు..!

కొమరం భీమ్ జిల్లా: తిర్యాని మండలం చోపిడి గ్రామ పంచాయతీ లోని గోవరి గూడ గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా తాజ్ బాబా సేవ సమితి బెల్లంపల్లి వారి సహకారంతో గ్రామంలోని 30 నిరుపేద కుటుంబాలకు పోలీసులు 25 కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆసిఫాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివాసులు అసాంఘిక శక్తులు దూరంగా ఉండాలని సూచించారు ఆదివాసులు తమ పిల్లలను చదివించుకుని విధంగా తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు మూఢనమ్మకాలను విడనాడి సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని సూచించారు ముఖ్యంగా యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉద్యోగాల్లో రాణించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ అల్లం నరేందర్ తిర్యానీ ఎస్ ఐ సిహెచ్ రమేష్, తాజ్ బాబా సేవా సమితి బెల్లంపల్లి వారు పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు..