Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 June 2022, 6:13 pm Posted by : Anjaneyulu Dega

అధికారులకు తీరికేది.?

మంచిర్యాల జిల్లా: ప్రతీ వాహనదారుడు తమ బండి ఫిట్నెస్, లైసెన్స్, బీమా, తదితరవన్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా విద్యార్థులను తరలించే బస్సులు, వ్యానులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా అనుకోని ఘటన జరిగితే అనేక మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు జరిగే ఆస్కారం ఉంది. దీనిని నివారించేందుకు రవాణా శాఖ అధికారులు సైతం ప్రతీ స్కూల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోడ్లపై స్కూల్ బస్సులను తనిఖీలు చేపడితే ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? డ్రైవర్లు అర్హత, అనుభవం ఉన్న వారా? కాదా? విద్యార్థులను సామర్థ్యం మించి తరలిస్తున్నారా? విద్యార్థుల తరలింపునకు అనుగుణంగాబస్సు సీట్లు, డిజైను ఉందా తదితర వివరాలను. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..