కాంగ్రెస్ లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హైదరాబాద్: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 11 నెలల్లో ఎన్నికలు...