Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 June 2022, 4:22 pm Posted by : Anjaneyulu Dega

తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు..!

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చెపట్టింది. తెరాస హైదరాబాద్ కార్యాలయం కోసం 4,935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100కే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు..

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.