Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 June 2022, 12:10 pm Posted by : Anjaneyulu Dega

కేటీఆర్ కు ఆనంద్ మహీంద్రా సరదా ట్వీట్..!

మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్ లాగేసుకుంటుంది

మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేస్తానన్న మంత్రి

హైదరాబాద్: ‘మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్ లాగేసుకుంటుంద’ని మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సరదాగా ట్వీట్ చేశారు. జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ను కేటీఆర్ బుధవారం సందర్శించి.. ట్రాక్టర్ నడిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడిస్తూ ‘మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ. అందుకోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ” ఫొటోలకు ఫోజులిస్తా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు. ‘కేటీఆర్, మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది’ అని ఆనంద్ చమత్కరించారు..