Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 June 2022, 9:03 am Posted by : Anjaneyulu Dega

ఫోన్ నంబర్ ఇవ్వకపోతే రేప్ చేస్తా..?

హైదరాబాద్: హైదరాబాద్ శివారు రాయదుర్గం పరిధిలోని ఓ హోటల్లో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కాన్సుల్ లో న్యూట్రిషన్ గా పనిచేసే ఓ యువతి తన ఇద్దరు స్నేహితులు బాక్సర్ విక్రమ్, విష్ణులతో కలిసి ఈనెల 18న అర్ధ రాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ హోటల్ కు వెళ్లింది. అప్పటికే అక్కడ మయాంక్ అగర్వాల్, అబ్రార్, ఆరిఫ్ ఉద్దీన్, ఖాదర్ తో పాటు మరో ఇద్దరు అదే హోటల్లోని బార్ లో ఉన్నారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ ఆ యువతి ఫోన్ నంబర్ అడిగారు. ఫోన్ నంబర్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అత్యాచారం చేస్తామని బెదిరించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది…

దీంతో ఆమె స్నేహితులు విక్రమ్, విష్ణులు మయాంక్ గ్రూప్ తో గొడవకు దిగారని, ఆపై పరస్పరం దాడి చేసుకున్నారని తెలిపింది. ఈ ఘర్షణలో అబ్రార్ కు గాయాలయ్యాయి. దీనిపై ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అబ్రార్ పిర్యాదు చేయగా, ఈరోజు ఉదయం యువతి ఫిర్యాదు చేసింది సీసీటీవీ పుటేజీ పరిశీలించి తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..