Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 June 2022, 9:50 pm Posted by : anjudega

జర్నలిస్టుల హక్కులను కాపాడండి..?

దాడులతో జర్నలిస్టుల గొంతును నొక్కలేరు

మంచిర్యాల జిల్లా: సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చే జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ వారి హక్కులను కాపాడాలని కోరుతూ బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టు సంఘాల నాయకులు, విలేకరులు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల మున్సిపల్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి అధికారులు నిర్వహించిన కార్యక్రమం పట్ల పత్రిక విలేఖరి వ్రాసిన వార్తా కథనాన్ని నిరసిస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సంబంధిత విలేకరి ఇంటిముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్మికులు అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

జర్నలిస్టు సంఘాలు మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చే జర్నలిస్టుల పట్ల జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను ఖండించాలి అని పత్రికల్లో వచ్చే వార్తల పట్ల అభ్యంతరాలు ఉంటే అనేక మార్గాల్లో నిరసన తెలపవచ్చు అని, విలేకర్ల పైన ఉద్దేశపూర్వక మైన దౌర్జన్య సంఘటనలు చేపట్టడం అన్యాయమని ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులు తమ తప్పు తెలుసుకునే వరకు జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సంబంధిత వార్తలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, పాల్గొన్నారు..