
వికారాబాద్ జిల్లా: మోమినేట మండలం కేసారం వద్ద పెళ్లి బస్సు చిక్కుకుపోయింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వద్ద వరదనీటిలో చిక్కుకున్న బస్సు… ముందుకు కదల్లేక.. వెనక్కి వెళ్లలేక అక్కడే ఇరుక్కు పోయింది. బస్సులో ఉన్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు..
హైదరాబాద్ లోని బోరబండకు చెందిన పెళ్లి బస్సు… కోటపల్లి మండలంలో పెళ్లి వేడుకను ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది. విద్యుత్ మోటార్ల ద్వారా వరద నీటిని తోడారు..