
హనుమకొండ: వరంగల్ జిల్లా దబీర్ పేటలో రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాకేష్ మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలిస్తున్న క్రమంలో అంతిమయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈక్రమంలో తెరాస నాయకులు సీతక్క గోబ్యాక్ .. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘మీరు నివాళులర్పిస్తున్నప్పుడు మేము ఎందుకు నివాళులర్పించకూడదు’ అని సీతక్క ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఓ వైపు వాగుతుండగానే మరోవైపు తెరాస నాయకులు.. కాంగ్రెస్ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని సీతక్కకు రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి తరలించారు. తెరాస నాయకుల తీరుపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..