ఇలాంటివి భారత్ లోనే సాధ్యమంటోన్న ఆనంద్ మహీంద్రా

ఆంజనేయులు న్యూస్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సరికొత్తగా అనిపించే ఫొటోలు, వీడియోలను ట్విటర్ లో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్ కు సంబంధించిన క్లిప్పింగ్ ను మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. టైర్లు మినహాయిస్తే.. ఆ స్కూటర్ మొత్తాన్ని అలంకరణ వస్తువులతో చూడముచ్చటగా...