Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 June 2022, 7:14 am Posted by : Anjaneyulu Dega

ఆదాయ పన్నుల శాఖ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నా..!

మంచిర్యాల జిల్లా: జిల్లా లోని ఆదాయ పన్నుల శాఖ కార్యాలయం ముందు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. విచారణ పేరుతో ఈ.డి సోనియా , రాహుల్ గాంధీలను వేధించడాన్ని  నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదాయపన్ను శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్,  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోనియా రాహుల్ గాంధీలను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. గంటల తరబడి విచారణ పేరుతో వేధింపులు చేయడం సమంజసం కాదని వారు హితవు పలికారు..

ఈ కార్యక్రమంలో మన్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళ అధ్యక్షురాలు గజ్జెల హేమలత,పట్టణ ఉపాధ్యక్షులు సదానందం, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రెగుంట రమేష్, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాడి పల్లవి, తదితరులు పాల్గొన్నారు..