Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 June 2022, 4:29 pm Posted by : Anjaneyulu Dega

సెటిల్మెంట్లకు పాల్పడే వారిపై చర్యలు తప్పవు..!

మంచిర్యాల డిసీపీ అఖిల్ మహాజన్

రామగుండం పోలీస్ కమిషనరేట్: పోలీస్ స్టేషన్లలో సమస్యలు సెటిల్ చేస్తాం అంటూ డబ్బులు వసూళ్ళు చేస్తూ, బెదిరింపులు దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని మంచిర్యాల ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రిజిస్టర్ లేని వివిధ రకాల హక్కుల కమిషన్, మహిళా మండలి, మహిళా సంఘాల కార్యకర్తలమని చెప్పుకుంటూ పోలీస్ అధికారులు తెలుసని చట్టాన్ని అతిక్రమిస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో భూములు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకులు, ప్రేమ సంబంధిత విషయాలు పరిష్కరిస్తామని నమ్మించి, చట్టాన్ని అతిక్రమించి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకొని భాదితులపై దాడులు, బెదిరింపులకు పాల్పడడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. యూనియన్ల పేరు చెప్పి సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వవద్దని, సమస్యలు ఉంటే న్యాయం కొరకు కోర్టులను సంప్రదించాలని డిసీపీ సూచించారు..