Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 June 2022, 2:25 pm Posted by : Anjaneyulu Dega

అంతర్జాతీయ యోగా పురస్కరించుకొని శోభాయాత్ర..!

వివిధరకాల యోగా విన్యాసాలతో ప్రదర్శనలు

మంచిర్యాల జిల్లా: జూన్ 21న జరగనున్న 8వ అంతర్భాతీయ యోగా దినోత్సవమును, పురస్కరించుకొని బుధవారం రోజున ఆయుష్ డిపార్ట్ మెంట్, ప్రైవేటు యోగా సంస్థల ఆధ్వర్యంలో శోభ యాత్ర ను విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగాంగా శోభయాత్రలో మద్యల అక్కడక్కడ వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించడం జరిగినది. విశ్వ ఆయుర్వేద పరిషత్ మంచిర్యాల విభాగం వారు కూడా ఇందులో పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి, డా” నారాయణ రావు అధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ నోడల్ అధికారి. డా” జగన్మోహన్, డిప్యూటి నోడల్ అధికారులు అధికారి డా” ప్రశాంత్, డా” పద్మజ, డా” సంజయ్ కుమార్, ఆయుష్ ఫార్మాసిస్టులు, సిబ్బంది హాజరై ఈ కార్యక్రమమును విజయ వంతం చేశారు..

ఇందులో మంచిర్యాల జిల్లా యోగా సంస్థల గురువులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్ ఆర్య, బాలకృష్ణ,ముక్త వేణుగోపాల్, కోడూరి శ్రీనివాస్, రాజయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.. మంచిర్యాల బస్టాండ్ ముందు వివిధరకాల యోగా విన్యాసాలు ప్రదర్శించారు…