విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగటం..!

మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను వెంటనే తగించాలని కోరుతూ మంచిర్యాల బస్ డిపో ముందు ఎన్.ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ సెస్ అని విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను 3రేట్లు పెంచి విద్యార్థులను చదువుకు దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో హైస్కూల్, మండలంలో ఇంటర్ కాలేజీ, నియోజకవర్గం లో పీజీ కాలేజీ...