Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 June 2022, 1:30 pm Posted by : Anjaneyulu Dega

నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష..!

హైదరాబాద్: తెలంగాణలో నలుగురు పోలీసు అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి గతేడాది దాఖలు చేసిన పిటిషన్ పై సోమవరం హైకోర్టు విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వీరు వ్యవహరించారని పోలీసు అధికారులపై అభియోగాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేసినట్లు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డీ, ఎస్ఐ నరేశ్ కు 4 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది..

ఈ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.