Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 June 2022, 6:18 pm Posted by : anjudega

ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

ఆదిలాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ ల నాయకులూ టీ. ఆర్. ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం బేల మండలంలో రాంకామ్ గ్రామం లో ఏర్పాటు చేసిన లో పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంకామ్ గ్రామస్తులు 200మంది టీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.

ఈ కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వమనోహర్, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..