Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 June 2022, 6:33 pm Posted by : Anjaneyulu Dega

ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: లోని టిఎస్ ఆర్టీసీ అన్ని డిపోలలో ఇంజనీరింగ్, డిప్లమా అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/డిప్లమా హోల్డర్ ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సుధా పరిమళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ WWW. tsrtc. telangana. gov. in లో పేర్కొన్న నిబంధనలు, షరతులతో సంతృప్తి చెందినవారు ఈనెల 15 వరకు ఆన్లైన్ లో www. mhrdnats. gov.in వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో 18 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశాన్ని ఉమ్మడి జిల్లా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.