
ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్ లో బిల్డింగ్ పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కాగా, యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. యూనియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు ఎమ్మెల్యే నిధులతో భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కార్మికుడు జీవిత బీమా చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజ రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు వాసు దేవ్, టిఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, రామ్ కుమార్, భరత్, మెట్టు ప్రహ్లాద్, దమ్మ పాల్, తదితరులు పాల్గొన్నారు.
౯