Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 May 2022, 12:37 pm Posted by : Anjaneyulu Dega

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..!

ముఖ్యఅతిథిగా ఈటెల రాజేందర్  రాక..!

మంచిర్యాల జిల్లా:  శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం హమాలీవాడ కట్ట పోచమ్మ వచ్చేనెల 15,16,17 తేదీలలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట బోనాలు, హోమం, పట్నాలు నిర్వహించబడతాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం తరఫున ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తప్పకుండా వస్తాను అని చెప్పారు అలాగే ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి రమ్మని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు టి.శ్రీనివాస్ ముదిరాజ్ పట్టణ జనరల్ సెక్రటరీ జక్కుల రాజు, కోశాధికారి గుజ్జీటి తిరుపతి, ఆర్గనైజర్ సెక్రటరీ ఎం సురేష్, జిల్లా అధ్యక్షులు రావుల శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు కంకణాల సతీష్,ప్రచార కార్యదర్శులు భూత పెళ్లి రాజేశం, బోయ పోతుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు..