పాకుతూనే ఉన్న మంకీపాక్స్.. మరో రెండు దేశాల్లో గుర్తింపు

  మెక్సికో సిటీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ.. మంకీపాక్స్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి పాకుతోంది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా మెక్సికో, ఐర్లాండ్ దేశాల్లోనూ తొలి కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ గుర్తించినట్లు మెక్సికో వైద్యాధికారులు వెల్లడించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సదరు వ్యక్తి అమెరికా నుంచి నెదర్లాండ్ మీదుగా తమ దేశానికి...