పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది – జిల్లా ఎస్పి

ఆదిలాబాద్ జిల్లా: ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మొదటగా పోలీస్ స్టేషన్ లో పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులను, వివరాలను తెలుసుకొని వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తు నందు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారి పట్ల...