రేపు హైదరాబాదు కు ప్రధాని మోదీ..!
ఐఎస్ బీలో 2వేల మంది పోలీసుల మోహరింపు హైదరాబాద్: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకొని.. హెలికాప్టర్ లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) ఆవరణలో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గచ్చిబౌలిలోని ఐఎస్బీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఐఎస్బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్సీయూలలో భారీ ఎత్తున పోలీసులను...