వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం..?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: తిర్యాని మండలంలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మండలం లో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉన్న చేసేదేమి లేక విద్యార్థులు పాఠశాలల ఉపాధ్యాయులు సమకూర్చిన ప్రైవేటు వాహనంలో ఇరుకున కూర్చొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. సుమారు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగించి తీరా పరీక్ష సమయంలో విద్యార్థులు అలసటకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సులు మండలంలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు...