రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం..!
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. బండ ప్రకాష్ స్థానంలో రవి 2024 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా...