Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 May 2022, 11:08 pm Posted by : anjudega

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం..!

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. బండ ప్రకాష్ స్థానంలో రవి 2024 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ లో పదవీకాలం ముగియనున్న డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెరాస అభ్యర్థులు బండి పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు వెయనున్నారు..