దిల్లీలో భారీ వర్షం.. పలుచోట్ల కూలిన ఇళ్లు..!
దిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా మండుటెండలతో అల్లాడిపోతున్న దిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఈ తెల్లవారుజాము నుంచి ఢిల్లీలో వర్షం కురుస్తోంది. గంటకు 50-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు...