త్వరలో అందుబాటులోకి భారీగా మెడికల్ సీట్లు: మంత్రి సబిత
హైదరాబాద్: కొవిడ్ సమయంలో వైద్యులందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోగులకు సేవలు చేశారని కొనియాడారు. యశోదా ఆస్పత్రి 10వ వార్షిక యంగ్ డాక్టర్స్ క్యాంప్ లో పాల్గొన్న ఆమె మాట్లాడారు. "ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది. నగరానికి నలుమూలలా నాలుగు సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నా. త్వరలో మెడికల్ సీట్లు భారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కష్టం వచ్చినప్పుడే బలంగా నిలబడాలి. ఏ రంగం ఎంచుకున్నా నిబద్ధత, మానవత్వంతో నడుచుకోవాలి....