మహిళలకు కమీషన్ ఆశ చూపించి గంజాయి తరలింపు.. ముఠా అరెస్టు.?

హైదరాబాద్: గంజాయి సరఫరాకు అంతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమీషన్ అశ చూపించి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు ఆయినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. "ఈ కేసులో ప్రధాన నిందితులు శ్రీకాంత్, రాహుల్ కలిసి...