Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 May 2022, 2:16 pm Posted by : Anjaneyulu Dega

తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు..!

ఇక్కడ జీతాలిచ్చే పరిస్థితి లేదు.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారట: బండి సంజయ్

కరీంనగర్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమున్నా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పెట్రో ధరలు తగ్గించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు…

కరీంనగర్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు…

“లీటర్ పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోంది. రాష్ట్రం వ్యాట్ తగ్గిస్తే లీటర్ పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు. దొచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్ ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. దేశాన్ని ఉద్ధరిస్తారట. ఇక్కడ జీతాలిచ్చే పరిస్థితి లేదు.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారట. రాష్ట్రంలో పింఛన్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొండగట్టులో ప్రజలు చనిపోతే సీఎం పరామర్శించారా? సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారినైనా పరామర్శించారా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు..