Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 May 2022, 7:24 pm Posted by : Anjaneyulu Dega

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిమ్మక్క.. సన్మానించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: కర్ణాటకకు చెందిన వృక్షమాత పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఇవాళ హైదరాబాదు వచ్చిన ఆమెను ప్రగతిభవన్లో ఘనంగా సత్కరించారు. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులెవరూ లేరని కేసీఆర్ కొనియాడారు. ఆమె మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేసీఆర్ చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ప్రకృతికి మేలు చేస్తుందని ఈ సందర్భంగా తిమ్మక్క చెప్పారు. మరోవైపు ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న తిమ్మక్క… ప్రగతిభవన్ లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె ఎంపీని ఆశీర్వదించారు. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న సంతోష్న ప్రశంసించారు.

తన 111వ పుట్టిన రోజు జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ద్వారా అందిస్తున్న అవార్డును ఈ సంవత్సరం సంతోష్  కు అందించనున్నట్లు తిమ్మక్క తెలిపారు.