Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 May 2022, 2:15 pm Posted by : Anjaneyulu Dega

సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా.!

మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

పీఆర్సి ప్రకారం పెరిగిన  వేతనాలు చెల్లించాలి.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

మంచిర్యాల జిల్లా: గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి తరహా వేతనాలు హుజురాబాద్ ఎలక్షన్ సందర్భంగా గా మంత్రి హరీష్ రావు ఇస్తారని అన్నారు. కాని ఇప్పటి వరకు ఇవ్వకపోగా ప్రస్తుతం ఇస్తున్న చాలీ చాలని వేతనాలు కూడా మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు పస్తులు ఉండే దుస్థితి తలెత్తిందని. కరోణ కాలం తర్వాత నిత్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఇవ్వాలి. ప్రభుత్వం అందించే సబ్బులు, బట్టలు, నూనె, బెల్లం, గ్లౌస్ లు చెప్పులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. 8గంటల పని విధానాన్ని అమలు చేయాలి. ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలి. అలాగే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు రాజలింగు, అధ్యక్షులు సాయి కృష్ణ,లచ్చన్న, బాణయ్య, సత్తయ్య, సుజిత్, శంకరయ్య, భూమయ్య, నర్సయ్య, బాణయ్య, తదితరులు పాల్గొన్నారు..