చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలి

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ రంగారెడ్డి జిల్లా-కేశంపేట: అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు.గురువారం ఆయన కేశంపేట మండలంలోని పాపిరెడ్డి గూడ,చౌలపల్లి,బోదునంపల్లి గ్రామాల్లో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు.అంగన్వాడీ కేంద్రాలలో అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న ఆహారాన్ని ఆయన పరిశీలించారు.అంగన్వాడీ టీచర్లు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉండడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తినలేకపోతున్నారని చిన్నారుల తల్లులు జేసి దృష్టికి తీసుకువచ్చి ఆవేదన...