
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయమైంది. క్యాషియర్ ప్రవీణ్ రూ.22.53లక్షలు తీసుకెళ్లాడని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం క్యాషియర్ డబ్బు తీసుకొని పరారైనట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు ప్రవీణ్ నిన్నటి నుంచి కుటుంబసభ్యులకు కూడా. అందుబాటులో లేడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.