యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం.?

ఉత్తరప్రదేశ్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీ పదవి నుంచి ముకుల్ గోయెల్ ను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బుధవారం సీఎంఓ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పనిపై ఆసక్తి చూపడం లేదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని ముకుల్ గోయల్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ పదవి నుంచి ఆయనను తప్పించి ప్రాధాన్యత లేని సివిల్ డిఫెన్స్ డీజీగా ఆయనను బదిలీ చేశారు. డీజీపీగా ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ ఎంపికయ్యే అవకాశాలు...